కేటీఆర్ వ్యాఖ్యలు సిగ్గుచేటు

మాచారెడ్డి, బతుకమ్మ: తెలంగాణ కాంగ్రెస్ ఇన్ చార్జీ నటరాజన్ మీనన్ ను కించ పరిచే విధంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడడం సిగ్గుచేటని కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు, జిల్లా రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్   అభియాన్ సంఘటన  జిల్లా కన్వీనర్  గీరెడ్డి మహేందర్ రెడ్డి అన్నారు. కేటీఆర్ నోరు దగ్గర పెట్టుకోవాలన్నారు.  ఆర్భాటాలకు దూరంగా ఉండే నటరాజన్ పై  అనుచిత వ్యాఖ్యలు చేయడం దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడ్డారు.