భీమ్ గల్, బతుకమ్మ : భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు(కెటీఆర్)జన్మదిన వేడుకలను బాల్కొండ కానిస్టెన్సీలోని అన్ని మండల కేంద్రాల్లో గురువారం ఘనంగా నిర్వహించారు. మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశానుసారం వేల్పూర్, భీమ్ గల్, బాల్కొండ, ముప్కాల్, మెండోరా, ఎర్గట్ల, కమ్మర్ పల్లి మండల బీయర్ యస్ పార్టీ కార్యాలయాల్లో కేక్ కట్ చేసి కేటీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా మండల పార్టీ ప్రెసిడెంట్లు మాట్లాడుతూ రాష్ట్రం లో ఐ టీ రంగాన్ని అతి తక్కువ కాలం అత్యంత అభివృద్ధి చేసి, యువతకు ఉపాధి కల్పించిన గొప్ప నాయకుడు కేటీఆర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ ప్రెసిడెంట్లు నగదర్ రెడ్డి (వేల్పూర్), దొంకంటి నర్సయ్య(భీమ్ గల్), రేగుంట దేవేందర్(కమ్మర్ పల్లి), బద్దం ప్రవీణ్ రెడ్డి(బాల్కొండ), శేఖర్ రెడ్డి (మెండోరా) నర్సారెడ్డి(ముప్కాల్), పూర్ణనందం (ఎర్గట్ల), పార్టీ మండల, గ్రామ నాయకులు, సొసైటీ చైర్మన్లు, డైరెక్టర్లు,మాజీ సర్పంచులు,వార్డ్ మెంబర్లు, మాజీ ఎంపిటిసీలు, మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మెన్లు,డైరెక్టర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
