ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

  బాన్సువాడ, బతుకమ్మ :   మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు (కేటీఆర్) జన్మదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం బాన్సువాడ పట్టణంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పలు సేవా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నోట్‌బుక్స్ పంపిణీ చేశారు. ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు పంపిణీ చేసి వారి ఆరోగ్యాన్ని పరామర్శించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలను పంపిణీ చేశారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమైన వారికి ఉపయోగపడేలా స్వచ్ఛంద...