ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు
నందిపేట్, బతుకమ్మ : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను నందిపేట్ మండలంలో ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆదేశాల మేరకు బీఆర్ఎస్ నందిపేట్ మండల పార్టీ అధ్యక్షుడు మచ్చర్ల సాగర్ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా పలుగుట్ట కేదారేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. కేటీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని, ప్రజాసేవలో మరింత ముందుకు సాగి భవిష్యత్తులో ఉన్నత స్థానాలను అధిరోహించాలని...