రుద్రూర్, బతుకమ్మ :
రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 50వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి తినిపించుకుంటూ కేటీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం అంబం గ్రామంలోని అంగన్వాడి కేంద్రంలో చిన్నారులకు పలకలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ గాండ్ల మధు, నాయకులు దౌర్ సాయిలు, కొత్తపల్లి రవికిరణ్, సిరిగిరి శేఖర్, కన్నె ప్రవీణ్, బొట్టే గజేందర్, శివ కుమార్, పార్వతి ప్రవీణ్, హాజీ, జువ్వల శ్రావణ్, క్లిక్ రవి, సుమన్, వినీత్ పటేల్, సతీష్, వివిధ గ్రామాల కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.