ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబానికి కేటిఆర్ పరామర్శ
నర్సంపేట, బతుకమ్మ : ఆర్టీసీ సమ్మె కాలంలో ఆత్మహత్యకు పాల్పడిన డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబానికి బీఆర్ఎస్ అండగా నిలిచింది. నర్సంపేట నియోజకవర్గం ముత్తోజిపేటలోని దివంగత శంకర్ గౌడ్ నివాసానికి వెళ్లిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా శంకర్ గౌడ్ ఫోటోకు పూలమాలలు వేసి శ్రధ్దాంజలి ఘటించారు. ఈ సందర్భంగా పార్టీ తరపున వారి కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయాన్ని కేటీఆర్ అందజేశారు. ఈ సందర్భంగా...