ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న కేటీఆర్

  హైదరాబాద్, బతుకమ్మ :   తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కేటీఆర్, హైదరాబాద్ - సికింద్రాబాద్ జంట నగరాల ప్రజలు ఎంతో భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పించుకుంటున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందే బోనాలను రాష్ట్ర పండుగగా ప్రకటించాలని డిమాండ్ చేసినప్పటికీ, అప్పటి ఉమ్మడి పాలకులు పట్టించుకోలేదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ నాయకత్వంలోని...