Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 October 2024, 12:02 pm Posted by : ramakrishna

బెటాలియన్ పోలీసు కుటుంబాలకు మద్దతు పలికిన కేటీఆర్

. . . జాతీయ రహదారిపై స్పెషల్ పార్టీ పోలీసు కుటుంబ సభ్యుల నిరసన

నిజామాబాద్, బతుకమ్మ :

నిజామాబాద్ జిల్లాలోని ఏడో బెటాలియన్ లో పని చేస్తున్న పోలీసు సిబ్బంది కుటుంబ సభ్యులు రోడ్డెక్కారు. తమ కుటుంబ సభ్యులను 8 గంటలకు మించి పని చేయిస్తున్నారని ఐదేళ్ళు తిరుగకముందే ఇష్టం వచ్చినప్పుడు బదిలీ చేయడం వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయని జాతీయ రహదారిపై బైటాయించారు. జాతీయ రహదారి మీదుగా వెళ్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు  పోలీసు కుటుంబాలకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా అక్కడికి చేరుకున్న బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ పోలీసు కుటుంబ సభ్యులకు సర్ధి చెప్పారు. మాజీ మంత్రి కేటీఆర్ వెంట హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బల్క సుమన్, జాజల సురేందర్ తదితరులున్నారు.