కవిత ఆరోపణలకు కేటీఆర్ సమాధానం చెప్పాలి

హైదరాబాద్, బతుకమ్మ :  కవిత ఆరోపణలకు కేటీఆర్ సమాధానం చెప్పాలని  టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్  డిమాండ్ చేశారు.  కేటీఆర్ స్థాయికి మించి మాట్లాడుతున్నారని విమర్శించారు.  తెలంగాణను దోచుకున్న మీరెక్కడ.. దేశం కోసం సర్వం త్యాగం చేసిన గాంధీ కుటుంబమెక్కడ? అని ప్రశ్నించారు.   కాళేశ్వరం విషయంలో సీబీఐ విచారణను తప్పించుకోవాలని మోదీ కాళ్లు మొక్కడానికి కూడా వెనుకాడడం లేదని ఆరోపించారు. -