సిద్దిపేట, బతుకమ్మ : సిద్దిపేట జిల్లాలోని కేసీఆర్ నివాసం ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో గురువారం నుంచి మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అక్కడే ఉన్నారు. భవిష్యత్ కార్యచరణపై కేసీఆర్ తో కేటీఆర్ మంతనాలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, కేసీఆర్ తో కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి గురువారం 10 గంటల పాటు సుదీర్ఘంగా సమావేశమైన విషయం తెలిసిందే. శుక్రవారం కూడా కేసీఆర్ తో సమావేశమయ్యే ఛాన్స్ ఉంది. ఈనెలలో కరీంనగర్ లో నిర్వహించే బీసీ సభపై చర్చించే అవకాశం ఉంది. కాళేశ్వరం కమిషన్ నివేదికలో బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా వస్తే ఏం చేయాలనేదానిపై సమాలోచనలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టుతో జరుగుతున్న ప్రయోజనాలను ప్రజలకు వివరించాలని కేసీఆర్ నేతలను ఆదేశించారు.