సిరిసిల్ల జేఎన్టీయూ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని సీఎంకు కేటీఆర్ విజ్ఞప్తి

  . . .రూ.402 కోట్లతో మంజూరైన శాశ్వత క్యాంపస్ నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలి   . . .  కొత్త క్యాంపస్ పూర్తయ్యే వరకు ప్రస్తుత ప్రాంగణంలోనే కళాశాల కొనసాగించాలి   సిరిసిల్లా, బతుకమ్మ :    రాజన్న సిరిసిల్ల జిల్లాలోని జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. కళాశాల శాశ్వత క్యాంపస్ నిర్మాణంలో జరుగుతున్న జాప్యాన్ని నివారించి, విద్యార్థుల విద్యాభ్యాసానికి ఎలాంటి ఆటంకం కలగకుండా...