Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 August 2025, 8:05 pm Posted by : ramakrishna

ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

  • ఇస్కాన్ ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్ర
  • శ్రీ కోదండరామాలయంలో బాలరామకృష్ణులకు అభిషేకం

 

వేల్పూర్, బతుకమ్మ : శ్రావణ శుద్ధ అష్టమిని పురస్కరించుకొని మండలంలోని రామన్నపేట్ లోని శ్రీ కోదండ రామాలయంలో గ్రామాభివృద్ధి కమిటీ సహకారం తో ఇస్కొన్ వారి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సుందర రూప దాస ప్రభు పర్యవేక్షణ లో శనివారం వేల్పూర్ రోడ్డు పొలిమేర నుండి రథం పై బాలరామకృష్ణ ప్రభుల చిత్రపటాన్ని ఉంచి ఉరి హన్మాండ్ల ఆలయం గుండా బ్యాంక్ ముందు నుండి హరి నామ సంకీర్తనలతో జగన్నాతుని రథయాత్రను అంగరంగ వైభవంగా నిర్వహించారు. చిన్నారుల ఆధ్యాత్మిక నృత్యాలు, హరి నామ భజనలు, హరే కృష్ణ హరే కృష్ణ, హరే రామ హరే రామ అనే హరినామా సంకీర్తనలతో

Krishnashtami celebrations in full swing

గ్రామమంతామారుమ్రోగింది. రథయాత్ర గ్రామ వీదుల గుండా ఊరేగింపుగా శ్రీ కోదండ రామాలయం వరకు కొనసాగింది. అనంతరం శ్రీబాలరామ కృష్ణుల మూర్తులను రథం పై నుండి ఆలయ కల్యాణ మంటపంకు తీసుకెళ్లి మంటపంలో ప్రతిష్టించి శ్రీబాలరామ కృష్ణులకు పంచాంగవ్య, పంచామృత మహాభిషేకాన్ని కన్నుల పండువుగా నిర్వహించారు.బాలరామ కృష్ణులకు మహా నైవేద్యం, హారతినిచ్చి, కృష్ణభగవానుని డోలా సేవ నిర్వహించారు. అనంతరం భక్తులందరు స్వామి వారికి అభిషేకం చేసి, జోల పాట పాడుతూ డోలా సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమం లో స్థానిక గ్రామాభివృద్ధి కమిటీ ప్రతినిధులు, సభ్యులు, గ్రామ యూత్ సంఘాల సభ్యులు, మహిళలు, ఇతర గ్రామంలో ఇస్కాన్ భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Krishnashtami celebrations in full swing