ఫ్యూచర్ లైన్ పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలు

చందూర్, బతుకమ్మ : చందూర్ మండలం కెంద్రంలోని ఫ్యూచర్ లైన్ పాఠశాలలో బుధవారం ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థిని, విద్యార్థులు కృష్ణుని, గోపికల వేశాధారణతో అలరించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ ప్రియాంక, స్వప్న మాట్లాడుతూ.. విద్యార్థులకు సంస్కృతి, సంప్రదాయం గూర్చి తెలుపుతూ ప్రతి సంవత్సరం ఈ కృష్ణాష్టమి వేడుకలను నిర్వహించారు. అనంతరం విద్యార్థులతో ఉట్టి కొట్టి ఆనందం చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఉదయ శ్రీ, నిశిత , సంధ్య, సులక్షన, జయశ్రీ , లలిత విద్యార్థులు పాల్గొన్నారు.