Batukammanews
Newspaper Banner
Date of Publish : 21 October 2025, 5:26 pm Posted by : ramakrishna

అఖిలభారత యాదవ మహాసభ మండల అధ్యక్షుడిగా కృష్ణ కాంత్ యాదవ్

సిరిసిల్ల, బతుకమ్మ : గంభీరావుపేట  అఖిలభారత యాదవ మహాసభ మండల అధ్యక్షుడిగా గంభీరావుపేట మండలం ముస్తఫానగర్ గ్రామానికి చెందిన దోమకొండ కృష్ణ కాంత్ యాదవ్ ను నియమించిన జిల్లా అధ్యక్షులు అన్న బోయిన తిరుపతి యాదవ్.ఇటీవలే మండలంలోని అన్ని గ్రామాల యాదవ సంఘం సభ్యులచే మండల యాదవ సంఘం అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. అఖిలభారత యాదవ మహాసభ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు అన్న బోయిన తిరుపతి యాదవ్ (ఏటి యాదవ్ ) సిరిసిల్ల లో మండల అధ్యక్షుడిగా దోమకొండ కృష్ణకాంత్ యాదవ్ ను ఏకగ్రీవం చేస్తూ నియామక పత్రం అందించారు. దోమకొండ కృష్ణకాంత్ యాదవ్ నియామకానికి సహకరించిన జిల్లా మండల నాయకత్వానికి యాదవ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా యాదవ సంఘాల కన్వీనర్ సౌగాని కొమురయ్య యాదవ్,రాష్ట్ర నాయకులు వాసం మల్లేశం యాదవ్,వీరవేణి మల్లేష్ యాదవ్, పెద్ద వేణి వెంకట్ యాదవ్,మాజీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు చెవుల మల్లేశం యాదవ్,మండల కోశాధికారి  గొడుగు దేవయ్య యాదవ్, మండల ఉపాధ్యక్షులు చేకూటి మహేష్ యాదవ్,ఎలుక మల్లేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Krishna Kant Yadav appointed as All India Yadav Mahasabha Mandal President