బతుకమ్మ, బోధన్: శ్రీ కోట మైసమ్మ సహితా లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఆధ్వర్యంలో ఆలయ వ్యవస్థాపకులు పసుపులేటి గోపి కిషన్ సమక్షంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. చిన్నారులు రాధాకృష్ణ వేషధారణలో అలరించి భక్తులను ఆకట్టుకున్నారు. “హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే, కృష్ణం వందే జగద్గురుం” అంటూ భక్తులు గోపాలకృష్ణుని కీర్తిస్తూ పూజలు చేశారు. తదనంతరం ఉట్టి కొట్టే కార్యక్రమం సందడిగా సాగింది. రాధాకృష్ణ వేషధారణలో మెప్పించిన చిన్నారులకు పసుపులేటి గోపి కిషన్ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కుమార్, లోకేష్, కృష్ణ, సుధాకర్, కిషోర్, లింగం, రాకేష్, కైలాస్, సన్నీ, కార్తీక్, అజయ్, విష్ణు, చేతన్, సాత్విక్, అనిరుద్, సాయి, మనీష్, లిఖిత, అక్షయ్ తదితరులు పాల్గొన్నారు.
