Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 January 2025, 5:13 pm Posted by : ramakrishna

కాకతీయ ఒలంపియాడ్ లో క్రీడోత్సవ్ పోటీలు

 నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: నగరంలోని కాకతీయ ఒలంపియాడ్ సుభాష్ నగర్ స్కూల్ లో ప్రతిసంవత్సరం నిర్వహించే క్రీడోత్సవ్ పోటీలు అట్ట హాసంగా ప్రారంభమయ్యాయి. ఈ అంతర పాఠశాలల క్రీడా పోటీలలో కాకతీయ విద్యా సంస్థల కు చెందిన ఒలంపియాడ్ స్కూల్ సుభాష్ నగర్, & ఒలంపియాడ్ స్కూల్ (యమునా క్యాంపస్) ప్రగతినగర్ విద్యార్థులు వివిధ ఆటల పోటీలలో పాల్గొననున్నారు. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, బాస్కెట్ బాల్, స్కేటింగ్, యోగా, ఆర్ట్ & క్రాఫ్ట్ , ఇండోర్ గేమ్స్ తో పాటు అథ్లెటిక్స్ లో కూడా విద్యార్థులు పాల్గొంటారు. జనవరి 7,8,9,10 వ తేదీలలో జరిగే ఈ పోటీలలో పాల్గొని గెలిచే విద్యార్థులకు చివరిరోజు  25 న ముగింపు వేడుకలలో బహుమతి ప్రధానం చేయబడును. ఈ కార్య క్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డా. సెల్వరాజ్   (కిట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్) మట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటూ ఆటలు ఎంత ముఖ్యమో చెప్తూ క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇట్టి ప్రారంభ వేడుకలో కాకతీయ విద్యాసంస్థల డైరెక్టర్ రామోజీరావు, ప్రిన్సిపాల్ చంద్రశేఖర్, వైస్ ప్రిన్సిపాల్ దిగంబర్ , అకడమిక్ కోఆర్డినేటర్ ఫనిందర్, సుచరిత, క్రీడోత్సవ్ ఆర్గనైజర్లు శ్రీధర్ నాయక్ , సాయిలు  ఉపాధ్యాయ  బృందం పాల్గొన్నారు.

Kreedotsav competitions in Kakatiya Olympiad