భీమ్ గల్, బతుకమ్మ : ప్రజా రక్షణ కోసం పోలీస్ ఉద్యోగం చేస్తూ మనకు రక్షణగా నిలుస్తున్న కానిస్టేబుల్ ప్రమోద్ హత్యకు సంతాపంగా బొర్ర హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో కొవ్వత్తుల ర్యాలీని నిర్వహించారు. శనివారం యూత్ సభ్యులు బడా భీమ్ గల్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రమోద్ ఫ్లెక్సీని ఉంచి నివాళులార్పించారు. ఈ సందర్బంగా ప్రమోద్ అమర్ రహే అంటు నినాదాలు చేస్తూ కొవ్వత్తుల ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమం లో గ్రామ కమిటీ, బొర్ర హనుమాన్ యూత్ ల సభ్యులు, పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.