Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 June 2026, 9:10 pm Posted by : ramakrishna

ఏర్గట్ల మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా కౌడ భూమేశ్వర్ ఏకగ్రీవ ఎన్నిక

 

ఏర్గట్ల, బతుకమ్మ :

 

ఏర్గట్ల మండలంలోని గ్రామాల సర్పంచులు శుక్రవారం మండల కేంద్రంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మండల సర్పంచుల ఫోరం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా తోర్తి గ్రామ సర్పంచ్ కౌడ భూమేశ్వర్ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడిగా బట్టపూర్ గ్రామ సర్పంచ్ ప్రవీణ్ యాదవ్, జనరల్ సెక్రటరీగా తాళ్ల రాంపూర్ సర్పంచ్ బెజ్జారం పావని భానుచందర్, కార్యదర్శిగా నాగేంద్ర నగర్ గ్రామ సర్పంచ్ సందే రంజిత్ ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. అనంతరం నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు కౌడ భూమేశ్వర్‌ను సర్పంచులు శాలువా కప్పి పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. అలాగే సర్పంచుల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, అభివృద్ధి కార్యక్రమాలకు ముందుండి పనిచేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తాళ్ల రాంపూర్ సర్పంచ్ బెజ్జారం పావని భానుచందర్, నాగేంద్ర నగర్ సర్పంచ్ సందే రంజిత్, ఏర్గట్ల సర్పంచ్ కొలిప్యాక ఉపేందర్ రెడ్డి, బట్టపూర్ సర్పంచ్ ప్రవీణ్ యాదవ్, ధోంచంద సర్పంచ్ పెద్ద కాపుల శ్రీనివాస్ రెడ్డి, గుమ్మిర్యాల సర్పంచ్ దేశ బోయిన జమున సంజీవ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.