నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : బీసీ సంక్షేమ సంఘాన్ని బలోపేతం చేయడంలో భాగంగా శుక్రవారం బీసీ సంక్షేమ సంగం నగర ప్రధాన కార్యదర్శిగా కొట్టూరు చంద్రకాంత్ మేరు ను నియమించినట్టు బీసీ సంక్షేమ సంఘం నగర అధ్యక్షుడు దర్శనం దేవేందర్ తెలిపారు. ప్రస్తుతం జిల్లా మేరు సంఘానికి కోశాధికారిగా సేవలందిస్తూ అదేవిధంగా బీసీ సంక్షేమ సంఘానికి ఎన్నో రోజులుగా చేస్తున్న సేవలను చూసి గుర్తించి ఈ పదవి ఇవ్వడం జరిగిందని జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ అన్నారు. రాబోవు రోజుల్లో బీసీల అందరికీ 42 శాతం రిజర్వేషన్ రావాలంటే గట్టిగా పోరాడాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఉపాధ్యక్షులు బుస్స ఆంజనేయులు అన్నారు. యువకుడైన చంద్రకాంత్ నేతౄత్వంలో నగర బీసీ సంక్షేమ సంఘం బీసీల హక్కులకై ఇంకా గట్టిగా పోరాడుతదని అన్ని కులాలు ఏకమై ఒకే వేదికైనా బిసి సంక్షేమ సంఘం వేదికగా గట్టిగా పోరాడితే అధికార పీఠాలు కూడా కదులుతాయని బీసీల హక్కులు బీసీలకే చెందుతాయని జిల్లా ప్రధాన కార్యదర్శి పోల్కం గంగ కిషన్ మేరు అన్నారు. ఈ కార్యక్రమంలో నరాల సుధాకర్ తో పాటు బుస్స ఆంజనేయులు, పోల్కం గంగా కిషన్, ఆకుల ప్రసాద్, దర్శనం దేవేందర్,కరిపె రవిందర్, కొయ్యాడ శంకర్, శ్రీలత, అజయ్, చంద్రమోహన్, విజయ్ సాయి బసవ, చంద్రకాంత్, విజయ, సదానంద్, హన్మంత్ రావు బాలన్న తదితరులు పాల్గొన్నారు.