Batukammanews
Newspaper Banner
Date of Publish : 07 October 2024, 4:03 pm Posted by : ramakrishna

తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఆర్గనైజేషన్ సెక్రటరీ గా కొప్పు రాజేందర్ నియమికం

బతుకమ్మ, ఆర్మూర్ : తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షులుగా కొనసాగుతున్న నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండలం బ్రహ్మణపల్లి గ్రామానికి చెందిన కొప్పు రాజేందర్ ను రాష్ట్ర ఆర్గనైజేషన్ సెక్రటరీగా నియమిస్తూ తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్ నియామిక పత్రం అందజేశారు. అనంతరం నరేందర్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లోబీసీలకు ఇచ్చిన హామీ కామారెడ్డి డిక్లరేషన్ కులగణన వెంటనే పూర్తి చేసి బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. బిసి కులగణన, చట్టసభల్లో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటుచేసి విద్య ఉద్యోగ రంగాల్లో బీసీల వాటా అమలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కొప్పు రాజేందర్ మాట్లాడుతూ నాపై నమ్మకంతో జిల్లా ఉపాధ్యక్షులుగా కొనసాగుతున్న నన్ను గుర్తించి తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఆర్గనైజేషన్ సెక్రటరీగా నియమించినందుకు ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా బీసీలకు ఎక్కడ అన్యాయం జరిగిన అంతఃకరణ శుద్ధితో ముందుండి పోరాడుతానని అన్నారు. గత ప్రభుత్వం కులగనన చేపట్టలేక పోయిందని ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం కులగనన చేపట్టిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. బి ఆర్ ఎస్ కులగనన చేయకుండా కాలయాపన చేస్తూ బీసీలను మోసగించిందని వారికి బీసీలు తగిన గుణపాఠం చెప్పారని అదేవిధంగా బిజెపి కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేశాయని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్ ద్వారా ప్రత్యేక నిధులు కేటాయించి బీసీలకు లోన్లు, సబ్సిడీలు ప్రకటించి బీసీల వ్యాపార అభివృద్ధికి సహకరించి ఆదుకోవాలని, ఉద్యోగాలలో చట్టసభలలో బీసీలకు అధిక ప్రాధాన్యత కల్పించాలని నామినేటెడ్ పదవులలో కూడా బీసీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ కమిటీ అధ్యక్షులు అబ్బగోనీ అశోక్ గౌడ్, జిల్లా అధ్యక్షులు నారగౌడ్, రాష్ట్ర కార్యదర్శులు దాసరి మూర్తి జగడం వెంకన్న, జిల్లా వర్కింగ్ కమిటీ అధ్యక్షులు రాస శ్యామ్, సూరినీడ దశరథ్, మండల నాయకులు మార్పాక నవీన్,  తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం మహిళా నాయకురాళ్లు, బీసీ కుల సంఘలా నాయకులు, మాజీ జెడ్పిటిసిలు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, వివిధ బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.