రుద్రూర్, బతుకమ్మ :
బాన్సువాడ నియోజకవర్గం రుద్రూర్ గ్రామానికి చెందిన బీజేపీ కార్యకర్త గొర్ల త్రినేష్ కుటుంబానికి 5 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. విషయం తెలుసుకుని వారి కుటుంబ సభ్యులకు గురువారం బాన్సువాడ బీజేపీ నాయకులు ఎన్ ఆర్ ఐ కోనేరు శశాంక్ మృతుడి కుటుంబానికి 5 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా కౌన్సిల్ మెంబర్ ప్రశాంత్ గౌడ్, రుద్రూర్ మండల ఉపాధ్యక్షులు ఎం.వి.కృష్ణంరాజు, వినోద్ కుమార్, మండల ప్రధాన కార్యదర్శి వడ్ల సాయినాథ్ , అనిల్, ధర్మారం వెంకటేష్, బీజేపీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.