–మాజీ ఎంపిటిసి సుధాకర్
ఇందల్వాయి,బతుకమ్మ : సినీ నటుడు నాగార్జున కుటుంబం పై, కేటీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి కొండా సురేఖ ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని మాజీ ఎంపిటిసి సుధాకర్ డిమాండ్ చేశారు.రాష్ట్రంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మంత్రివర్గంలో మంచి టాలెంట్ పర్సన్ గా ఐటి రంగానికి వన్నె తెచ్చే విధంగా శ్రమించి దేశీయ విదేశీయ పర్యటన చేసి రాష్ట్రానికి ఎన్నో కొత్త కంపెనీలు వచ్చే విధంగా ప్రయత్నం చేసి యువతకు ఉపాధి దొరకాలని ఉద్దేశంతో కీలకమైన శాఖ ఐటీ శాఖలో పనిచేసిన కేటీఆర్ ని ప్రపంచంలో నలుమూలలో ఉన్న దేశంలో ఉన్న పెద్ద పెద్ద నాయకులు అభినందించారని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగ ప్రపంచ దేశాలే ఆహ్వానించాయని అన్నారు. ఐటి రంగాన్ని ముందుకు తీసుకెళ్లాడని, అలాంటి మంత్రి రాష్ట్ర ప్రయోజనాల కోసమే సమయం లేకుండా పనిచేసిన వ్యక్తి కేటీఆర్ లాంటి వ్యక్తి పైన, నాగార్జున కుటుంబం పైన చేయడం సరైనది కాదన్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పాశంకుమార్, మేదరి గంగాధర్, మీసాల దాసు, తొగారి నరసయ్య, ముత్యం గంగా ప్రసాద్, నామాల పెద్ద గంగాధర్, ఉప్పల్ బై రాకేష్ ,తరుణ్ తదితరులు పాల్గొన్నారు.