మంత్రి వివేక్ వెంకటస్వామిపై కొండా సురేఖ ఫిర్యాదు
హైదరాబాద్, బతుకమ్మ : మంత్రి వివేక్ వెంకటస్వామిపై కొండా సురేఖ సీఎంవోకు ఫిర్యాదు చేసింది. ఉపాధి, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, తనకు సమాచారం ఇవ్వకుండా తన అటవీ శాఖ అధికారులతో సమావేశం ఏర్పాటు చేయడంపై కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 2-3 రోజుల క్రితం ఈ సమావేశం జరిగినట్టు అటవీ శాఖ అధికారుల ద్వారా తెలుసుకున్నానని అసంతృప్తి వ్యక్తం చేస్తూ సీఎంవోలో మంత్రి కొండా సురేఖ ఫిర్యాదు చేశారు.