Batukammanews
Newspaper Banner
Date of Publish : 27 September 2024, 4:52 pm Posted by : ramakrishna

కొండా లక్ష్మణ్ బాపూజీ  జయంతి వేడుకలు

బతుకమ్మ, ఆర్మూర్ : తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ  జయంతి వేడుకలు శుక్రవారం నిర్వహించారు.  ఆర్మూర్ మండల కేంద్రంలో గల కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.  ఈ సందర్భంగా బీసీ సంక్షేమ నాయకులు అబ్బగోని అశోక్ గౌడ్ మాట్లాడుతూ కొండా లక్ష్మణ బాబూజీ క్విట్ ఇండియా ఉద్యమం తో పాటు రజాకా ఉద్యమంలో,  నిజాం లకు కు వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తి మరియు స్వాతంత్ర ఉద్యమం తెలంగాణ ఉద్యమలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తిగా చిరస్థాయిగా  నిలుస్తారని తెలిపారు. అదేవిధంగా కామారెడ్డి రిజర్వేషన్ లో భాగంగా 42% స్థానిక సంస్థల ఎలక్షన్లలో బీసీ రిజర్వేషన్లు ప్రకటిస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంతవరకు ప్రకటించకపోవడం పట్ల తీవ్రమైన అసంతృప్తితో ఉన్నామని తెలియజేశారు. వెంటనే కులగణను జరిపించాలని దానితోపాటు డిక్లరేషన్ ప్రకటించాలని కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.