Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 September 2024, 5:41 pm Posted by : ramakrishna

కోండా లక్ష్మణ్ బాపూజీ  జయంతి ఉత్సవాలను ఘనంగా  నిర్వహించాలి

జయంతి ఉత్సవాల పై ఈరవత్రి అనిల్ సంఘ నాయకులు చర్చలు

 బతుకమ్మ,  నిజామాబాద్ :                                                                         

తెలంగాణ ఉద్యమ నేత, మాజీ మంత్రి ఆచార్య కోండ లక్ష్మణ్ బాపుజీ  జయంతి ఉత్సవాలను ఘనంగా  నిర్వహించాలని అందుకు సంఘం సభ్యులు ఐక్యంగా కలిసి పని చేయాలని రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్ సూచించారు. మంగళవారం నిజామాబాద్ ఆర్ అండ్ బి అతిథి గృహంలో కొండా లక్ష్మణ్ బాపు జయంతి ఉత్సవాలు, పద్మశాలి సంఘం యొక్క అభివృద్ధి గురించి పద్మశాలి సంఘం జిల్లా నాయకులతో రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం జిల్లా నాయకులు చేనేత పద్మ సమైక్య జిల్లా అధ్యక్షులు డాక్టర్ వెన్నెల్ దాస్ శ్రీనివాస్, పెంటు దత్తాధ్రీ, కస్తూరి గంగరాజు, లక్కోర రాజేందర్, సంఘ సభ్యులు పాల్గొన్నారు.