పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి.సాయి చైతన్య ఆదేశానుసారంగా నిజామాబాద్ కమిషనరేట్ కార్యాలయంలో నిజామాబాద్ అదనపు డీ.సీ.పీ (అడ్మిన్) బస్వారెడ్డి ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి 110వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొండ లక్ష్మణ్ బాపూజీ ఫోటోకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం అదనపు డి.సి.పి(అడ్మిన్ ) మాట్లాడుతూ సకలజనుల, సబ్బండ వర్గాల ప్రజల సంతోషంగా ఉండాలని, జీవితాంతం పోరాడిన వ్యక్తి అని తెలిపారు. సాయుధ పోరాట కాలంలో పెత్తందారులను...