తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన కొండా లక్ష్మణ్ బాపూజీ

-అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ  బతుకమ్మ నిజామాబాద్ సిటీ :   స్వాతంత్ర సమరయోధులు, తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమకారులు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్బంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వినాయక నగర్ విగ్రహాల పార్కులో నిర్వహించిన జయంతి ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్బంగా బిజెపి నాయకులు, పద్మశాలి సంఘ పెద్దమనుషులతో కలిసి బాపూజీ విగ్రహానికి పూల మాల వేసి ఘన నివాళులు అర్పించారు.  అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతు బాపూజీ తెలంగాణ...