- -అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ
బతుకమ్మ నిజామాబాద్ సిటీ : స్వాతంత్ర సమరయోధులు, తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమకారులు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్బంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వినాయక నగర్ విగ్రహాల పార్కులో నిర్వహించిన జయంతి ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్బంగా బిజెపి నాయకులు, పద్మశాలి సంఘ పెద్దమనుషులతో కలిసి బాపూజీ విగ్రహానికి పూల మాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతు బాపూజీ తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమనికి ఊపిరి పోసిన మహనీయులు ప్రతేక తెలంగాణ కోసం తన మంత్రి పదవిని గడ్డి పోచల భావించి రాజీనామా చేసిన వ్యక్తి బాపూజీ అని అన్నారు. తెలంగాణ వస్తే మన బతుకులు బాగుపడతాయి అని 96 ఏళ్ల వయసులో అత్యంత అత్యల్ప ఉష్ణోగ్రతలు ఉండే ఢిల్లీలో జంతర్ మంతర్ లో దీక్ష చేసిన గొప్ప తెలంగాణ వాది కొండా లక్ష్మణ్ బాపూజీ అన్నారు.
కేంద్ర ప్రభుత్వం కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యమ పోరాటస్ఫూర్తిని గుర్తించి అతని పేరు మీద పోస్టల్ స్టాంప్ ను విడుదల చేయడం తెలంగాణ బిడ్డలందరం గర్వించదగ్గ విషయం అన్నారు. నేటి యువతరం లక్ష్మణ్ బాపూజీని ఆదర్శంగా తీసుకోవాలని వారి ఆకాంక్షలను నెరవేర్చే విదంగా బంగారు తెలంగాణ కళ సాకారం కోసం పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్పొరేటర్లు, పద్మశాలి సంఘం పెద్దమనుషులు ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు.