బడుగు బలహీన వర్గాల స్ఫూర్తి ప్రదాత కొండా లక్ష్మణ్ బాపూజీ

హైదరాబాద్, బతుకమ్మ: బడుగు బలహీన వర్గాల స్ఫూర్తి ప్రదాత, స్వరాష్ట్రం కోసం పరితపించిన తెలంగాణ వాది, మాజీ మంత్రి ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ అని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్బంగా శనివారం హైదరాబాద్ లోని తన నివాసంలో ఆయన చిత్రపటానికి పూలతో ఘనమైన నివాళి  అర్పించారు.