Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 September 2025, 10:25 am Posted by : ramakrishna

శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

తిరుమల, బతుకమ్మ :  తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం శాస్త్రోక్తంగా  కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. ఈనెల 24న శ్రీవారి బ్రహోత్సవాలను పురస్కరించుకొని టీటీడీ అధికారులు ఆలయాన్ని శుద్ధి చేశారు. ఈకార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఉన్నతాధికారులు, సిబ్బంది, అర్చకులు పాల్గొన్నారు. శ్రీవారికి ప్రత్యేక కైంకర్యాలు నిర్వహించిన అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు.

నేటి మధ్యాహ్నం 12గంటలకు టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం

టీటీడీ చైర్మన్ అధ్యక్షతన టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం మంగళవారం మధ్యాహ్నం 12గంటలకు జరగనుంది. శ్రీవారి వార్షిక బ్రహోత్సవాల ఏర్పాట్లు,  గరుడ వాహన సేవపై చర్చించనున్నారు.

Koil Alwar Thirumanjanam at Srivari Temple