. . . ఆమోదం తెలిపిన గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల
హైదరాబాద్, బతుకమ్మ :
కోదండరామ్, అజారుద్దీన్ ల ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల ఓకే చేశారు. గత కొన్ని రోజులుగా పెండింగ్ లో ఉన్న గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ఆచార్య కోదండరాం, మంత్రి అజారుద్దీన్ ల ఫైల్ పై గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల శనివారం సంతకం చేశారు. దానితో ఆరు నెలలుగా మంత్రి పదవి ఉన్న అభ్యర్థిత్వం కోసం ఎదురుచూస్తున్న అజారుద్దీన్ కు ప్రొఫెసర్ కోదండరాములకు ఊరట లభించింది. గత ఏడాది ఆగస్టు 30న రాష్ట్ర క్యాబినెట్ గవర్నర్ కోటాలో అజారుద్దీన్ తో పాటు ఆచార్య కోదండరాములను ఎమ్మెల్సీగా నామినేట్ చేయాలని గవర్నర్కు సిఫారసు చేశారు. ఈ మధ్యకాలంలోని మైనార్టీ కోటాలో అజారుద్దీన్ కు మంత్రి పదవి లభించింది. కానీ గవర్నర్ ఆయన శాసనమండలి సభ్యత్వాన్ని ఓకే చేయకుండానే జిష్ణుదేవ్ వర్మ మారడంతో కొత్త గవర్నర్ కు ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఇతర మంత్రులు మరోసారి సిఫారసు చేశారు. అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఆరు నెలలు సమీపిస్తుండడంతో ఎమ్మెల్సీగా నామినేట్ అవుతారా లేక రాజీనామా చేస్తారని చర్చ జరుగుతున్న కాలంలో గవర్నర్ సంతకంతో ఈ వ్యవహారానికి చెక్ పెట్టినట్లు అయింది.