విహారయాత్రతో విజ్ఞానం

బతుకమ్మ,మోర్తాడ్: మోర్తాడ్ మండలంలోని పాలెం గ్రామంలో గల ఎంపియుపిఎస్ పాఠశాల విద్యార్థి సోమవారం డోన్కల్  గ్రామానికి క్షేత్ర పర్యటనకు రావడం జరిగింది. పర్యటనలో భాగంగా డిజిటల్ బోధన విధానం, పాఠశాలలోని గ్రంథాలయం, ప్రయోగశాలను, కిచెన్ గార్డెన్ తదితర అంశాలను పరిశీలించడం జరిగింది. అలాగే గ్రామాల్లోని వెంకటేశ్వర ఆలయం సందర్శించిన విద్యార్థులు. క్షేత్ర పర్యటనలో భాగంగా కొత్త విషయాలను తెలుసుకున్నామని విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు జగదీశ్వర్, ఉపాధ్యాయులు గంగామణి, మాణిక్యం, సురేష్, మధు, సిఆర్పి పరిమళ తదితరులు పాల్గొన్నారు.