Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 November 2025, 4:50 pm Posted by : ramakrishna

చట్టాలపై అవగాహన అవసరం

బతుకమ్మ, భిక్కనూరు: విద్యార్థులు రాజ్యాంగం చట్టాలపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సివిల్ జడ్జ్ నాగరాణి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో విద్యార్థులకు జిల్లా న్యాయ సేవాధిక సంస్థ ఆధ్వర్యంలో రాజ్యాంగం చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జీవించే హక్కు, భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు, బాల్యవివాహాల నిషేధ చట్టం, మోటార్ వాహనాల చట్టాలు, డ్రగ్స్ , పోక్సోచట్టాల గురించి విద్యార్థులకు వివరించారు. ఆర్టికల్ 39( ఏ)ప్రకారం ఉచిత న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ రాజగంగారెడ్డి, రేఖ, ఊర్మిళ, రమణ ఉపాధ్యాయులు విద్యార్థులు ఉన్నారు.