భూ చట్టాలు, పన్నుల చట్టాలపై అవగాహన
నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో న్యాయ కళాశాల సెమినార్ హాల్లో భూమి సంబంధిత చట్టాలు మరియు పన్నుల సూత్రాలు మీద అవగాహన కల్పించారు. ఈ రెండు చట్టాల యొక్క ప్రాధాన్యతను, దానిని అమలు పరుచుట లో తలెత్తే సమస్యల మీద లోతైన అవగాహన న్యాయ విద్యార్థులకు కల్పించారు. రిసోర్స్ పర్సన్ కె.నరసింహ చార్యులు, రిటైర్డ్ జిల్లా జడ్జి పన్ను చట్టాలపై ప్రసంగించారు. జీవి సుబ్రహ్మణ్యం రిటైర్డ్ జిల్లా జడ్జి భూమి సంబంధిత చట్టాల గురించి సరళంగా సామాన్యులకు అర్థమయ్యే రీతిలో సవివరంగా...