నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో న్యాయ కళాశాల సెమినార్ హాల్లో భూమి సంబంధిత చట్టాలు మరియు పన్నుల సూత్రాలు మీద అవగాహన కల్పించారు. ఈ రెండు చట్టాల యొక్క ప్రాధాన్యతను, దానిని అమలు పరుచుట లో తలెత్తే సమస్యల మీద లోతైన అవగాహన న్యాయ విద్యార్థులకు కల్పించారు. రిసోర్స్ పర్సన్ కె.నరసింహ చార్యులు, రిటైర్డ్ జిల్లా జడ్జి పన్ను చట్టాలపై ప్రసంగించారు. జీవి సుబ్రహ్మణ్యం రిటైర్డ్ జిల్లా జడ్జి భూమి సంబంధిత చట్టాల గురించి సరళంగా సామాన్యులకు అర్థమయ్యే రీతిలో సవివరంగా విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో న్యాయ కళాశాల ప్రిన్సిపాల్, హెచ్ ఓ డి డాక్టర్ ప్రసన్న రాణి కన్వీనర్ గా నిర్వహించారు. డాక్టర్ బి స్రవంతి చైర్మన్ అండ్ బి ఓ ఎస్ డాక్టర్ జెట్లింగ్ ఎల్లోసా, కాంటాక్ట్ ఫ్యాకల్టీ డాక్టర్ నాగజ్యోతి, న్యాయ కళాశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
