నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : బోధన్ రోడ్డు లోని మై ఫీల్ హోటల్ వద్ద చాకుతో దాడి చేసిన వ్యక్తిని రిమాండ్ కు తరలించినట్లు వన్ టౌన్ ఎస్ఎచ్ఓ బి.రఘుపతి తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. గత సంవత్సరం వినాయక నిమజ్జనం రోజున ఆర్య నగర్ లో జరిగిన గొడవను మనసులో పెట్టుకొని ఈనె 20న రాత్రి నిజామాబాద్ పట్టణ కేంద్రంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మై ఫీల్ హోటల్ వద్ద నగరంలోని వినాయక్ నగర్ కు చెందిన దోమల సాయికుమార్ పై కత్తి తో దాడి చేసి గాయపర్చిన కేసులో వినాయక్ నగర్ కు చెందిన కన్నిగిడే సాయికుమార్ ని అరెస్టు చేసి గౌరవనీయ న్యాయస్థానం ముందు హాజరు పరిచి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.