కత్తితో దాడి.. ఒకరి మృతి
మేడ్చల్, బతుకమ్మ: తన తల్లితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడని ఆగ్రహంతో ఓ యువకుడిపై మరో యువకుడు కత్తితో దాడి చేసి చంపేశాడు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సయ్యద్ డానిష్(27) అనే యువకుడి తల్లితో బిలాల్ (30) అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న డానిష్ బిలాల్ పై కత్తితో దాడి చేయగా, ఘటనా స్థలంలోనే బిలాల్ ప్రాణాలు విడిచాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టి మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.