భార్యపై కత్తితో దాడి
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: కుటుంబ తగాదాల నేపథ్యంలో భర్త భార్యపై దాడి చేసిన ఘటన మల్కాపూర్(జే) లో చోటు చేసుకుంది. మోపాల్ మండలం తాడెం గ్రామానికి చెందిన గణేశ్ కు మల్కాపూర్ కు చెందిన మౌనికతో వివాహమైంది. మౌనిక నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో స్వీపర్ గా పని చేస్తోంది. భర్తతో కలిసి మౌనిక ఆదివారం తన పుట్టింటికి వెళ్లింది. అక్కడ గొడవ జరగడంతో గణేశ్ కత్తితో మౌనికపై దాడి చేసి పొడిచాడు. మౌనిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని...