నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: కుటుంబ తగాదాల నేపథ్యంలో భర్త భార్యపై దాడి చేసిన ఘటన మల్కాపూర్(జే) లో చోటు చేసుకుంది. మోపాల్ మండలం తాడెం గ్రామానికి చెందిన గణేశ్ కు మల్కాపూర్ కు చెందిన మౌనికతో వివాహమైంది. మౌనిక నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో స్వీపర్ గా పని చేస్తోంది. భర్తతో కలిసి మౌనిక ఆదివారం తన పుట్టింటికి వెళ్లింది. అక్కడ గొడవ జరగడంతో గణేశ్ కత్తితో మౌనికపై దాడి చేసి పొడిచాడు. మౌనిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ వో ఆరిఫ్ తెలిపారు. మౌనిక ప్రస్తుతం నగరంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నదన్నారు.