తపస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గా కిషన్ రెడ్డి, మధుసుధన్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నూతన జిల్లా అధ్యక్ష, కార్యదర్శుల ను ఎన్నుకున్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో జరిగిన జిల్లా కార్యనిర్వాహక సమావేశంలో తపస్ ఎన్నికలు నిర్వహించడం జరిగింది. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఇందూరు జిల్లా అధ్యక్షులు గా నల్ల కిషన్ రెడ్డి ,ప్రధాన కార్యదర్శి గా డింగరి మధుసూదనాచారి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు విభాగ్ ఎన్నికల అధికారి వరంగంటి శ్రీనివాస్, జిల్లా ఎన్నికల అధికారి పాప గారి రామకృష్ణ రెడ్డి ప్రకటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో...