Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 October 2026, 1:59 pm Posted by : ramakrishna

బడా భీంగల్ కు చేరిన కిసాన్ మోర్చా సైకిల్ యాత్ర

 

భీంగల్, బతుకమ్మ :

 

కిషన్ మోర్చా ఆధ్వర్యంలో చేపట్టిన సైకిల్ యాత్ర ఆదివారం బడా భీంగల్ గ్రామానికి చేరుకుంది. ఈ సందర్భంగా సైకిల్ యాత్ర చేస్తున్న రైతులకు బడా భీంగల్ గ్రామ శాఖ అధ్యక్షుడు చిరునంచ రాజకుమార్, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. గత నెలలో 27న రైతాంగ సమస్యలే ప్రధాన అంశంగా, రైతుల సమస్యలను ప్రభుత్వానికి చేరవేసే విధంగా జిల్లా కిషన్ మోర్చా అధ్యక్షులు తిరుపతి రెడ్డి సైకిల్ యాత్ర ను బోధన్లో ప్రారంభించారు.ఈ సైకిల్ యాత్ర బోధన్ నుండి జగిత్యాల వరకు కొనసాగే క్రమంలో ఈరోజు బడా భీంగల్ చేరుకున్న సందర్భంగా బడా భీంగల్ బిజెపి కార్యకర్తలు, రైతులు వారిని ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు రాజ్ కుమార్, ఉపాధ్యక్షులు కోట్టాల మోహన్, రజనీకాంత్, కొట్టాల అశోక్, తక్కురి గంగానర్సయ్య, శ్రీనివాస్, వినీత్, లంక గంగా మోహన్, రైతులు పాల్గొన్నారు.