ఎన్‌ఎస్‌యూఐ కేంద్ర ఎన్నికల అథారిటీకి కిరణ్ ముగబసవ్ నియామకం
వెబ్ డెస్క్, బతుకమ్మ : నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఎస్‌యూఐ) అంతర్గత సంస్థాగత ఎన్నికలను సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు కేంద్ర ఎన్నికల అథారిటీ (సీఈఏ)లో కీలక నియామకం జరిగింది. ఎన్‌ఎస్‌యూఐ జాతీయ నాయకుడు కన్హయ్య కుమార్, సీనియర్ నేత కిరణ్ ముగబసవ్‌ను సీఈఏ సభ్యుడిగా నియమించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. హుబ్లీకి చెందిన కిరణ్ ముగబసవ్ గతంలో 2016 నుంచి 2018 వరకు ఎన్‌ఎస్‌యూఐ ఎన్నికల కమిషనర్‌గా సేవలందించారు. పార్టీ పట్ల క్రమశిక్షణ, నిబద్ధతతో పనిచేసే నాయకుడిగా ఆయనకు గుర్తింపు...