రేషన్ దందాలో సుల్తాన్ ల రాజ్యం
. పీడీఎస్ సిండికేట్ ను శాసిస్తున్న ‘చావల్ వాలే’ బ్రదర్స్ . జిల్లా కేంద్రంలో బహిరంగంగా గోదాంల నిర్వహణ . నిత్యం సరిహద్దులు దాటుతున్నవంద టన్నుల రేషన్ బియ్యం . పోలీసు స్టేషన్ ల వారీగా నెలవారీ మామూళ్లు? నిజామాబాద్, బతుకమ్మ: జిల్లా కేంద్రంలో రేషన్ బియ్యం సిండికేట్ ను ‘చావల్ వాలే భాయ్’(అన్నాదమ్ముళ్లు) శాసిస్తున్నారు. నిజామాబాద్ నగరంలోని నటరాజ్ థియేటర్ సమీపంలో నలుగురైదుగురితో సిండికేట్ ను ఏర్పాటు చేసి రేషన్ మాఫియాను శాసిస్తున్నారు. రేషన్ దందాను సిండికేట్ గా నడుపుతున్నారంటే వారు ఏమైనా...