కార్పొరేట్ కో హటావో.. దేశ్ కో బచావో..
రుద్రూర్ (వర్ని), బతుకమ్మ : క్విట్ ఇండియా జాతీయ ఉద్యమ స్ఫూర్తితో మోడీ కార్పొరేట్ ప్రభుత్వాన్ని భారతీయులు తరిమి కొట్టి దేశాన్ని రక్షించుకోవాలని సీపీఎం ఏరియా కార్యదర్శి నన్నేసాబ్ పిలుపునిచ్చారు. సీఐటీయూ, ఎఐకేఎస్, ఎఐఎడబ్ల్యూ, కేంద్ర కమిటీల పిలుపు మేరకు బుధవారం వర్ని మండల కేంద్రంలో కార్పొరేట్ కో హటావో దేశ్ కో బచావో నినాదంతో బైక్ ర్యాలీ నిర్వహించి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. అనంతరం సుభాష్ చంద్రబోస్ చౌరస్తా వద్ద నన్నేసాబ్ విలేకరులతో మాట్లాడుతూ.. మోడీ ప్రభుత్వం దేశ సంపదను...