తెలంగాణ యూనివర్సిటీ లో ముగిసిన ఖో – ఖో శిక్షణ శిబిరం

  డిచ్ పల్లి, బతుకమ్మ :   తెలంగాణ యూనివర్సిటీ ప్లే గ్రౌండ్ లో గత నాలుగు రోజులుగా కొనసాగుతున్న యూనివర్సిటీ మహిళల ఖో - ఖో శిక్షణ శిబిరం శనివారంతో ముగిసిందని యునివర్సిటీ స్పోర్ట్స్ డైరెక్టర్ డా.జి.బాలకిషన్ తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ క్రీడా నైపుణ్యాలను పెంపొందించుకొనుటకు ఈ శిక్షణ శిబిరం చాల ఉపయోగపడిందని తెలిపారు. యునివర్సిటీ క్రీడాకారినిలను, క్రీడా విభాగాన్ని ప్రోత్సహిస్తున్న తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొ.టి. యాదగిరి రావు, రిజిస్ట్రార్ ప్రొ.యాదగిరి లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు....