డిచ్ పల్లి, బతుకమ్మ :
తెలంగాణ యూనివర్సిటీ ప్లే గ్రౌండ్ లో గత నాలుగు రోజులుగా కొనసాగుతున్న యూనివర్సిటీ మహిళల ఖో – ఖో శిక్షణ శిబిరం శనివారంతో ముగిసిందని యునివర్సిటీ స్పోర్ట్స్ డైరెక్టర్ డా.జి.బాలకిషన్ తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ క్రీడా నైపుణ్యాలను పెంపొందించుకొనుటకు ఈ శిక్షణ శిబిరం చాల ఉపయోగపడిందని తెలిపారు. యునివర్సిటీ క్రీడాకారినిలను, క్రీడా విభాగాన్ని ప్రోత్సహిస్తున్న తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొ.టి. యాదగిరి రావు, రిజిస్ట్రార్ ప్రొ.యాదగిరి లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. క్రీడాకారులు యునివర్సీటీ పేరు ప్రఖ్యాతులను పెంపొందిచాలని సూచించారు. ఈ శిక్షణ శిబిరానికి సమన్వయకర్తగా ఫిజికల్ డైరెక్టర్ డా.బి.ఆర్.నేత వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో వివిధ కళాశాలల ఫిజికల్ డైరెక్టర్లు, క్రీడాకారులు, విద్యార్థులు పాల్గొన్నారు.