Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 April 2025, 1:54 pm Posted by : ramakrishna

ప్రధాని మోదీకి ఖర్గే, రాహుల్ లేఖ

= ప్రత్యేక పార్లమెంట్ సమావేశం ఏర్పాటు చేయాలని వినతి

డిల్లీ, బతుకమ్మ:  ప్రధాని మోదీకి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ లేఖ రాశారు. పార్లమెంట్ ఉభయ సభల ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని లేఖలో ఖర్గే కోరారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణపై చర్చించాలని కోరారు. ఉగ్రవాద దాడుల ఫలితంగా ఉత్పన్నమయ్యే పరిస్థితిని ఎదుర్కొవడానికి సమిష్టి సంకల్పాన్ని రూపొందించాలని విన్నవించారు. కాగా, ఇటీవల నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి ప్రధాని మోదీ రాకపోవడం సరికాదని ఖర్గే అన్నారు.