తాగునీటి సమస్యపై ఖండ్‌గాం గ్రామస్తుల ఆందోళన
బతుకమ్మ, బోధన్: బోధన్ మండలంలోని ఖండ్‌గాం గ్రామ ప్రజలు త్రాగునీటి సమస్యపై రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు ఫిల్టర్ వాటర్ బాటిల్స్ పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. గ్రామ యువకుడు మిసాలే నాగేష్ మాట్లాడుతూ బోధన్ మండలంలోని ఖండ్‌గాం, భిక్నెల్లి, సిద్దాపూర్ గ్రామాల్లో త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, ప్రజలు ఇతర గ్రామాలకు వెళ్లి నీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొన్నదని తెలిపారు. గ్రామానికి పక్కనే మంజీరా నది ఉన్నప్పటికీ త్రాగునీటి సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన...