Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 February 2025, 11:15 am Posted by : ramakrishna

కాసులు కోసం గంజాయి స్మగ్లర్ ను వదిలిన ఖాకీలు

 

. . రూ.50 వేల కోసం వన్ టౌన్ పోలీసుల నిర్వాకం

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:

 

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రైల్వే స్టేషన్ ప్రాంతంలో గంజాయితో పట్టుబడ్డ స్మగ్లర్ ను పోలీసులు కాసులకు కక్కుర్తి పడి వదిలేశారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. గంజాయితో పట్టుబడిన స్మగ్లర్ ను వదిలేసింది నిజామాబాద్ ఓకటవ టౌన్ పోలీసులు అని తెలిసింది. ఆ పోలీస్ స్టేషన్ లో అన్ని తానై వ్యవహరిస్తున్న ముదురు కానిస్టేబుల్ గంజాయి స్మగ్లింగ్ పై కొంతకాలంగా నజర్ వేసినట్లు తెలిసింది. అంతకు ముందే గంజాయి దందా లో ఉన్న స్మగ్లర్ పై నిఘావేసి అతడిని రైల్వే స్టేషన్ ప్రాంతంలో గత వారం రెడ్ హ్యాండేడ్ గా పట్టుకున్నట్లు సమాచారం. అవిషయం తెలిసిన  అదే పోలీస్ స్టేషన్ కు చెందిన మరో  ఎఎస్ఐ గంజాయి స్మగ్లర్ తో బేరసారాలు  సాగించి చివరికి రూ.50 వేలకు వదిలివేసినట్లు తెలిసింది. మరి గంజాయి ని ఎమి చేశారనేది సస్పెన్స్ గా మారింది. నిజామాబాద్ ఓకటవ టౌన్ పోలీస్ స్టేషన్ ను సివిల్, క్రిమినల్ కేసులను కుడా సెటిల్ మెంట్ అడ్డాగా మార్చిన అ ఎఎస్ఐ, కానిస్టేబుళ్ల పై లెక్కలేనన్ని ఆరోపణలు ఉన్న అక్కడి నుంచి బదిలీ చేయకపోవడం, వేటు వేయకపోవడంపై విమర్శలు ఉన్నాయి. అదికారులకు వాటాల కారణంగానే ముదుర్లను పెంచి పోషిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. గంజాయి స్మగ్లర్ ను కాసుల కోసం వదిలేసిన పోలీసులపై చర్యలను అటుంచి ఈ విషయం లీక్ చేసింది ఎవరనే విషయం పై పోలీసు అధికారులు ఆరా తీయడం గమనార్హం.