Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 September 2025, 3:48 pm Posted by : ramakrishna

తెలంగాణ ప్రతీక ఖైరతాబాద్ గణేష్

  • అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లోని వినాయకుడు తెలంగాణకు ప్రతిక వంటిదని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు.  హైదరాబాద్ ఖైరతాబాద్ వినాయకుని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా,  సహచర ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, పల్వాయి హరీష్, రామారావు పాటిల్ దర్శించుకోని ప్రతేక పూజ, హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే ధన్ పాల్ మాట్లాడుతు తెలంగాణ హిందూ ధర్మ సంస్కృతి &సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తున్న ఖైరతాబాద్ గణేష్ ని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. భారత దేశంలో అత్యంత ఎత్తయిన ఉత్సవ విగ్రహంగా పేరు పొందిన ఖైరతాబాద్ గణేష్ కు, లడ్డుకు ఒక ప్రతేక స్థానం ఉందని అన్నారు. ఆ గణేశుని ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరు సుభిక్షంగా ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని వేడుకోవడం జరిగిందన్నారు. ఖైరతాబాద్ గణేష్ దర్శనానికి విచ్చేసిన ఎమ్మెల్యే ధన్ పాల్ ని సహచర ఎమ్మెల్యేలను ఉత్సవ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Khairatabad Ganesh, the symbol of Telangana